Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి రెడీ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫిబ్రవరిలో గోవాలో డుం డుం డుం

rakul preeth singh
Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (18:02 IST)
గత రెండేళ్లలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ జంట ఈ ఏడాది కూడా పెళ్లి చేసుకోనున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌తో హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న రకుల్ ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. 
 
రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందంటూ బీ టౌన్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరూ స్క్రీన్‌పై కలిసి నటించకపోయినా ఆఫ్‌స్క్రీన్‌లో కలిశారు. 
 
రెండేళ్ల క్రితం తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆ తర్వాత వీరి పెళ్లిపై పుకార్లు చాలాసార్లు వైరల్ అయ్యాయి. ఈసారి కూడా త్వరలో వీరి పెళ్లి జరగనుందని బిటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈసారి ఆ వార్త నిజమేనని చిత్ర వర్గాలు అంటున్నాయి. 
 
2024లో పెళ్లి చేసుకోవాలని రకుల్, జాకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పెద్దగా ఆలస్యం చేయకుండా ఫిబ్రవరిలోనే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 22న గోవాలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏర్పాట్ల విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నట్లు సమాచారం. 
 
ప్రస్తుతం రకుల్ చేతిలో ఓ హిందీ సినిమాతో పాటు తమిళ సినిమా కూడా ఉంది.  ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "భారతీయుడు- 2"లో ఈ భామ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అంతేకాకుండా శివకార్తికేయన్ సరసన "అయలన్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా ‘మేరీ పట్నీ కా’ హిందీ రీమేక్‌లో కూడా రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments