Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెంచేసిన రకుల్ ప్రీత్ సింగ్.. చూడగానే షాకైన బాలయ్య

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:51 IST)
స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ - కథానాయకుడు". ఈ చిత్రంలో హీరోగా బాలకృష్ణ నటిస్తుంటే, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
 
దీనికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 'వేట‌గాడు' సినిమాలో ఫేమ‌స్ సాంగ్ అనే పాట‌ చిత్రీక‌ర‌ణ కూడా ఇప్ప‌టికే పూర్తైంద‌ని అంటున్నారు. ఇందులో బాల‌కృష్ణ‌, రకుల్‌లు ఎన్టీఆర్‌, శ్రీదేవిలా అద‌ర‌గొట్టార‌ని తెలుస్తుంది. 
 
ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పాపుల‌ర్ సాంగ్స్ కూడా త్వ‌ర‌లో షూట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. అయితే శ్రీదేవి పాత్ర పోషిస్తున్న ర‌కుల్ రెండో భాగం 'మ‌హానాయ‌కుడు'లో క‌నిపించ‌నుందని టాక్. ఇందులో 20 నిమిషాలు మాత్ర‌మే ర‌కుల్ పాత్ర ఉండ‌గా, దీని కోసం కోటి రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నట్టు సమాచారం. 
 
కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతుండ‌గా తొలి భాగం 'క‌థానాయకుడు' పేరుతో జ‌న‌వ‌రి 9న విడుదల కానుంది. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా దివి సీమీలో ఈ మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments