Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్యతో జతకట్టనున్న రకుల్ ప్రీత్...

టాలీవుడ్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య, హీరోయిన సమంతల వివాహంపై రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్‌లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ కథతో చైతు ప్రేక్షకుల

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2016 (09:20 IST)
టాలీవుడ్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య, హీరోయిన సమంతల వివాహంపై రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్‌లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌ కథతో చైతు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగార్జునను 'సోగ్గాడు'గా చూపించి బంపర్ హిట్టు కొట్టిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

తన తొలి సినిమాతోనే మంచిపేరు తెచ్చుకున్న కల్యాణ్ కృష్ణ ఇప్పుడు నాగ చైతన్యను సరికొత్త కోణంలో చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా సమంతను అనుకున్నారు. అయితే తాజాగా సమంత స్థానంలో రకుల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సమ్మూ-చైతూ రిలేషన్‌పై రోజుకో వార్త వస్తుండడంతోనే హీరోయిన్‌ను మార్చినట్లు ఫిలింనగర్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కోసం రకుల్ డేట్స్ కూడా కేటాయించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును ఈ నెలలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంచితే, రకుల్ ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన 'తుప్పారివాలన్' చిత్రంలో కూడా కథానాయికగా నటిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments