Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి'లో రజినీకాంత్ ఏజ్డ్ గెటప్ 20 నిమిషాలేనట.. జూలై 15న రిలీజ్!

రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కబాలి' సినిమా రికార్డ్లు మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం టీజర్‌కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కి

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (14:08 IST)
రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కబాలి' సినిమా రికార్డ్లు మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం టీజర్‌కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తోంది. కలైపులి ఎస్ థాను ఈ చిత్రానికి నిర్మాత. డైరెక్టర్ పా.రంజిత్ ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 
 
ఈ మూవీ తెలుగు ఆడియో సందర్భంగా హైదరాబాద్‌కి వచ్చిన ఈ డైరెక్టర్.. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా స్టోరీతోపాటు మరెన్నో వివరాలను బహిర్గతం చేశాడు. చాలాకాలం తర్వాత సినిమాల్లో రజినీ "కబాలి''లో ఓల్డ్ లుక్‌తో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు, టీజర్లు అన్నింటిలోనూ ఆయన ఈ గెటప్‌లోనే కనిపించారు. సినిమాలో మేజర్ భాగం రజినీ ఇలాగే కనిపిస్తారని.. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో మాత్రమే యంగ్‌గా కనిపిస్తారని అంతా భావించారు. కానీ ఆ అంచనాలు తలక్రిందులయ్యాయి. 
 
ఏజ్డ్‌ గెటప్‌లో రజినీ కనిపించేది కేవలం 20 నిమిషాలే అట. మిగిలిన భాగమంతా ఈ సూపర్‌ స్టార్ యంగ్‌గానే కనిపిస్తారట. 80ల్లో నటించిన సినిమాల్లో రజినీ ఎలా కనిపించారో ''కబాలి''లో ఆయన యంగ్‌ గెటప్‌ అలానే ఉంటుందని రంజిత్ చెప్పాడు. కాగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోను జూలై 15న రిలీజ్ చేయాలని దర్శకుడితో పాటు.. నిర్మాత కంకణం కట్టుకునివున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments