Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబో 2.0 కోసం దేశాన్నే క్రియేట్ చేస్తున్న శంకర్.. రజనీకాంత్ కోసమే ఇదంతా?

కబాలి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యానిమేషన్, టెక్నికల్ వర్క్ అ

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (14:55 IST)
కబాలి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యానిమేషన్, టెక్నికల్ వర్క్ అదిరిపోతుందని ఇప్పటికే కోలీవుడ్‌లో టాక్ వస్తోంది. తాజాగా రజనీకాంత్ కోసం శంకర్  దేశాన్నే క్రియేట్‌ చేస్తున్నారట. 
 
అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఓ రొమాంటిక్‌ పాట చిత్రీకరణను తొలుత ఉక్రెయిన్‌లో జరపాలనుకున్నారు. అయితే రజనీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం పాటను భారత్‌లోనే తీయనున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. శంకర్‌ ఉక్రెయిన్‌లోని చక్కటి లొకేషన్స్‌ ఎంచుకుని వీఎఫ్‌ఎక్స్‌ ద్వారా ఆ దేశ అందాలను పాటకు జత చేయనున్నారట.
 
ఈ పనుల్ని ఇప్పటికే మొదలు పెట్టేశారట. లొకేషన్స్‌కు వెళ్లకుండా ఆ దేశ అందాలను కళ్లుకు కట్టినట్లు చూపించబోవడం విశేషం అంటున్నాయి సినీ వర్గాలు. అమీజాక్సన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా 'రోబో'కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments