Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌‌లో బ్రిటిష్ భామతో రజనీకాంత్ రొమాన్స్...

శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో శంకర్ సినిమాలు నిర్మిస్తుంటాడు. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రజ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:30 IST)
శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో శంకర్ సినిమాలు నిర్మిస్తుంటాడు. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్‌లో విడుదలైన 'రోబో' చిత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో దీనికి సీక్వెల్‌గా 'రోబో 2' సినిమాను శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్లతో సినిమాను రూపొందిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
 
అప్పటినుంచి ఇప్పటివరకు 150 రోజులు షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరించారు. మొత్తంగా 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను పోషించారు. లైకా ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. 
 
ఇదిలావుంటే ప్రస్తుతం హీరో రజనీకాంత్ - అమీ జాక్సన్‌పై ఓ రోమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో రజనీ పూర్తిగా యంగ్‌గా కనిపిస్తుండడం విశేషం. ఈ సందర్భంగా సెట్‌లో తీసిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నవంబర్‌లో 'రోబో 2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తర్వాతి కథనం
Show comments