Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి కోసం పద్ధతి మార్చుకుంటున్న జక్కన్న!

దర్శక ధీరుడు రాజమౌళి ఈ నెల 23 న సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున పార్టీ ఇవ్వనున్నాడు. ఎందుకో తెలుసా.. ఆ రోజు ప్రభాస్ పుట్టిరోజు. ఎప్పుడో మూడేళ్ల క్రితం ''బాహుబలి'' షూటింగ్‌కు హాజరైన ప్రభాస్‌.. ఈ డిసెంబర్‌

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (15:06 IST)
దర్శక ధీరుడు రాజమౌళి ఈ నెల 23 న సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున పార్టీ ఇవ్వనున్నాడు. ఎందుకో తెలుసా.. ఆ రోజు ప్రభాస్ పుట్టిరోజు. ఎప్పుడో మూడేళ్ల క్రితం ''బాహుబలి'' షూటింగ్‌కు హాజరైన ప్రభాస్‌.. ఈ డిసెంబర్‌తో ఫ్రీ అయిపోతుండటంతో ప్రభాస్ పుట్టినరోజుకి రాజమౌళి ఈ పార్టీ ఇవ్వబోతున్నాడట. అంతేకాదు ఆ రోజు బాహుబలి 2 సంబంధించిన ప్రభాస్ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఇలా రెండు వేడుకలు ఒకే రోజు రావడంతో రాజమౌళి ఈ విధంగా పార్టీ ప్లాన్ చేసాడట.

ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 పాటల చిత్రీకరణలో బిజీ బిజీ‌గా గడుపుతున్న సంగతివిదితమే. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్న పట్టుదలతో ఉన్నారు. దానికి తగట్టే రాజమౌళి షూటింగ్ స్పీడ్ పెంచినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తన సినిమాలు హిట్టయినా.. లేదా ఇంకేదైనా సందర్భం వచ్చినా రాజమౌళి పార్టీ ఇవ్వడం అన్నది ఇప్పటిదాకా సినీ జనాలు ఎవరూ చూడలేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఇతర సెలబ్రెటీల్లా కాకుండా రాజమౌళిది ప్రత్యేక శైలి.

భారీ ఫంక్షన్లకు, పార్టీలకు రాజమౌళి ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. తన కుటుంబంతో గడిపేందుకే ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే రాజమౌళి తొలిసారి ఇండస్ట్రీ జనాలకు ఒక పెద్ద పార్టీ ఇవ్వడం టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ప్రభాస్‌ కూడా తన సన్నిహితులకు ఓ పార్టీ ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాడట. ఇటీవల ఆయన మైనపు బొమ్మను బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభాస్‌ కూడా ఓ బిగ్‌ పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments