Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది ఎపుడు గుర్తొచ్చిన తారక్‌ను బండబూతులు తిడతా : రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి.. మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి భాగంతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న బాహుబలి టీం, ఇప్పుడు రెండో భాగం కోసం మరింత భ

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (10:57 IST)
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి.. మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి భాగంతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న బాహుబలి టీం, ఇప్పుడు రెండో భాగం కోసం మరింత భారీగా రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో బాహుబలి పార్ట్ 2 మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే.. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి షూటింగ్‌లో బిజీ కావడం వలన ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపించక పోయినా.. అవసరమైనప్పుడు స్పందిస్తున్నాడు. ఇప్పుడు బాహుబలి ప్రమోషన్ పెంచాల్సిన సమయం దగ్గరకు రావడంతో.. వరుసగా ట్విట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాను దర్శకుడిగా మారి 15 ఏళ్లు అయిందని, డబ్బింగ్, ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేరి 25 ఏళ్ళు అయిందని.. అయితే తాను సినీ పరిశ్రమలోకి వచ్చి అంతకాలం అయినట్లు అనిపించడం లేదని తెలిపాడు. 
 
ఈసందర్భంగా 'స్టూడెంట్ నెంబర్ 1' షూటింగ్‌కు స్విట్జర్లాండ్‌కు వెళ్లగా.. అక్కడ తారక్‌కు, తనకు ఒకే రూమ్ ఇచ్చారని... అయితే.. తనకు మాత్రం 9 గంటలకే నిద్రపోవడం అలవాటని.. తారక్‌కి రాత్రి 12 గంటల వరకు టీవీ చూసే అలవాటని చెప్పాడు. అది కూడా వ్యవసాయ కార్యక్రమాలు చూస్తాడని.. స్విట్జర్లాండ్‌లో ఒకే ఛానెల్‌లో ఆ కార్యక్రమాలు ప్రసారమయ్యేవని చెప్పాడు. అయితే.. 'అది ఎప్పుడు గుర్తొచ్చినా తారక్‌ని తిట్టుకుంటాను' అని రాజమౌళి చెప్పారు. 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments