Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విజయేంద్రప్రసాద్

Webdunia
బుధవారం, 27 మే 2020 (17:23 IST)
దర్శకధీరుడు రాజమౌళి అపజయం అనేది లేకుండా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే... రాజమౌళి విజయం వెనక తండ్రి విజయేంద్రప్రసాద్ ఉన్నారు. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఎందుకంటే... రాజమౌళి తెరకెక్కించే సినిమాలన్నింటికీ కథా రచయిత ఆయనే.
 
రాజమౌళి తెరకెక్కించిన సినిమాలతో పాటు మెర్సల్, భజరంగీ భాయ్‌జాన్ తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా రచయిత ఆయనే. అందుకనే విజయేంద్రప్రసాద్ కథకు బాగా డిమాండ్.
 
 అయితే.. కథారచయితగా సక్సెస్ సాధించిన విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా మాత్రం విజయం సాధించలేకపోయాడు. అర్థాంగి, శ్రీకృష్ణ 2006, రాజన్న, శ్రీవల్లీ చిత్రాలను తెరకెక్కించినప్పటికీ దర్శకుడిగా ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాల్ని అందించలేదు.
 
మళ్లీ ఇప్పుడు విజయేంద్రప్రసాద్ దర్శకుడిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఓ యంగ్ హీరోకి కథ రాస్తున్నారని తెలిసింది. అయితే... ఆ యంగ్ హీరో ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. మరి... విజయేంద్రప్రసాద్ ఈసారి ఎవరితో సినిమా చేయనున్నాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments