Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే.. ఎస్ఎస్ రాజమౌళి స్పందనేంటి?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. అయితే, ఒక సినిమాలో తలెత్తిన ప్రశ్న నిత్యజీవి

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (12:53 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన స్పంద‌న‌తో బాహుబ‌లి 2 మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. అయితే, ఒక సినిమాలో తలెత్తిన ప్రశ్న నిత్యజీవితంలో తరచూ ఎదురు కావటం చాలా అరుదైన అంశంగా చెప్పాలి. అలాంటి ఘనత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలికే సొంతం. బాహుబలి చిత్రంలోని ఒక ప్రశ్న సినీ ప్రేక్షకులనే కాదు.. సాధారణ ప్రజానీకం కూడా దాని గురించి మాట్లాడుకునేలా చేయటమే కాదు.. అదో హాట్ టాపిక్‌గా మారింది. 
 
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నవిషయాన్ని కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ మొదలుకొని.. దర్శకుడు రాజమౌళి వరకూ ఇంతవరకు పెదవి విప్పింది లేదు. తాజాగా ఈ విషయం మీద రాజమౌళి తనదైనశైలిలో స్పందించాడు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం సినీపరిశ్రమలో ఇంత పెద్ద సెన్సేషన్ అవుతుందని ఊహించలేదని రాజమౌళి అన్నాడు. మొదటి భాగాన్ని ముగించేందుకు ఆ సన్నివేశమే సరైనదని యూనిట్ భావించిందని.. కానీ, ఆ ముగింపు ఇంత సెన్సేషన్‌గా మారుతుందని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. 
 
'బాహుబలి-2' ఫస్ట్ పోస్టర్ లాంచ్ సందర్భంగా పలు అంశాలపై స్పందించిన ఆయన, ఈ విషయాన్ని వెల్లడించాడు. ఏదేమైనప్పటికీ... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం ఇంత పాపులర్ కావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నాడు. కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడో ఎవరైనా సరిగ్గా చెప్పారా? అనే ప్రశ్నకు బదులుగా 'లేదు'అని సమాధానమిచ్చాడు రాజమౌళి. తొలి భాగంలో నటించడం ద్వారా తాను పొరపాటు చేశానని... ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయబోనని చెప్పాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో... సెకండ్ పార్ట్ తీయడం తనకు తేలికైందని రాజమౌళి చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments