దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత చేపట్టే భారీ ప్రాజెక్టుపైనే ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టీ నెలకొనివుంది. ముఖ్యంగా రాజమౌళి తదుపరి ఏం చేయబోతున్నాడు అన్నదానిపై కూడా అంత సస్పెన్స్ నెలకొంద
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత చేపట్టే భారీ ప్రాజెక్టుపైనే ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టీ నెలకొనివుంది. ముఖ్యంగా రాజమౌళి తదుపరి ఏం చేయబోతున్నాడు అన్నదానిపై కూడా అంత సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు.. రాజమౌళి ఏం చేసినా అది న్యూస్ అవుతోంది. 'బాహుబలి' తర్వాత జక్కన్న చేయబోయే సినిమా గురించి, ఏ హీరోతో యాక్ట్ చేస్తాడనే విషయంపైనా రకరకాల ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి.
ఈనేపథ్యంలో రాజమౌళి తదుపరి మూవీ టాలీవుడ్ ది కాక బాలీవుడ్ సినిమా చేస్తాడని లేటెస్ట్‌గా ఓ న్యూస్ బలంగా వినిపిస్తోంది. నిజానికి బాహుబలి తర్వాత రాజమౌళితో సినిమాకోసం బాలీవుడ్‌లో కూడా ప్రొడ్యూసర్లు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రాజమౌళి ఈమధ్య ఓ మాట చెప్పాడు. తను చేయబోయే మూవీలో బడ్జెట్‌ది కాదని, అలాగని మరీ భారీ మూవీ కాదని చెప్పాడు.
రాజమౌళి డైరెక్ట్ చేయబోయే బాలీవుడ్ సినిమాలో ఓ యంగ్ హీరో నటిస్తాడనీ.. బాలీవుడ్ నిర్మాత ఒకరు ఈ సినిమాను నిర్మిస్తాడని అంటున్నారు. డీవీవీ దానయ్య ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటాడని కూడా అంటున్నారు. ఇది పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఉంటుందట. డిసెంబర్ నాటికి పూర్తి స్క్రిప్ట్ సిద్ధంచేసే పనిలో దర్శకధీరుడు నిమగ్నమైవున్నట్టు తెలిపారు.