Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జూలీ 2'లో అందాలను ఆరబోయనున్న లక్ష్మీ రాయ్ ..

''కాంచనమాల కేబుల్ టీవీ'' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన హీరోయిన్ లక్ష్మీరాయ్. ఈ హీరోయిన్ తెలుగులో నటించిన చిత్రాలు తక్కువే అయినా, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి తన హవా కొనసాగిస్తోంది. ఈ మధ్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (16:25 IST)
''కాంచనమాల కేబుల్ టీవీ'' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన హీరోయిన్ లక్ష్మీరాయ్. ఈ హీరోయిన్ తెలుగులో నటించిన చిత్రాలు తక్కువే అయినా, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి తన హవా కొనసాగిస్తోంది. ఈ మధ్యనే ఈ భారీ అందం బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. హిందీ చిత్రం ''జూలీ-2'' లో ఇప్పటికే టూ పీస్, స్విమ్ దుస్తుల్లో నటించి బాలీవుడ్ వర్గాలను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందీ భామ. బాలీవుడ్‌లో ఆమెకు ఇదే తొలి చిత్రం. 
 
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. ఈ చిత్రానికి దీపక్. ఎస్ శివదాసాని దర్శకత్వం వహించబోతున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్‌గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కేజీల బరువు కూడా తగ్గిందట.
 
కాగా ఈ భామ ఇటీవల టాప్‌లెస్ దుస్తులు ధరించి సినిమా కార్యక్రమంలో పాల్గొని హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ రంగప్రవేశం చేయాలన్న తన కోరిక నెరవేరడంతో రాయ్‌లక్ష్మి అక్కడి సినీ వర్గాలను ఆకర్షించి బాలీవుడ్‌లోనే సెటిల్ అవ్వాలన్న ఆలోచనలో భాగంగానే అందాల ప్రదర్శన చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. మరి లక్ష్మీరాయ్ గ్లామర్ ప్రయత్నాలు బాలీవుడ్‌లో ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments