Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెరపై పీవీ సింధు... మ్యాగజైన్ కవర్ పేజి కోసం ఫోటో షూట్

ఒలింపిక్స్‌లో వెండి పతకం కొట్టి తన సత్తా చాటిన పీవీ సింధు వెండి తెర మీదకి వస్తుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితచరి

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:02 IST)
ఒలింపిక్స్‌లో వెండి పతకం కొట్టి తన సత్తా చాటిన పీవీ సింధు వెండి తెర మీదకి వస్తుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత చరిత్ర‌ను ప్రవీణ్ సత్తార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న సంగతితెలిసిందే. వచ్చే నెల నవంబర్‌లో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషించనున్నాడు.
 
ఈ నేపథ్యంలో పీవీ సింధు కూడా ఈ సినిమాలో నటించనుందని వార్తలు వెలువడుతున్నాయి. నిజ జీవితంలోని పివి సింధు పాత్రనే సినిమాలోనూ పోషిస్తుందని అందుకు తగ్గ సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో ఒలంపిక్స్ పథకం తీసుకొచ్చిన ఈమెకు దేశమంతటా క్రేజ్ పెరిగిపోయింది.
 
ఇప్పటికే ఈమె పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా చేసే అవకాశాలను సైతం అందుకుంది. పదుల సంఖ్యలో బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పీవీ సింధు ప్రస్తుతం ఓ మ్యాగజైన్ కవర్ పేజి కోసం ఫోటో షూట్ చేస్తోంది. అటువంటిది సింధు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments