డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా మెహబూబా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తర్వాత సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. పూరి డాటర్ ఇటీవల ప్రొడక్షన్ వైపు ఇంట్రస్ట్ చూపిస్తుంది. అందుచేత అన్ని విషయాలు తెలుసుకునేందుకుగాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుందని వార్తలు వచ్చాయి. అసలు పూరి డాటర్ పవిత్ర డైరెక్షన్ వైపు రానుందా..? లేక ప్రొడక్షన్ వైపు కెరీర్ స్టార్ట్ చేయనుందా అంటే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటపెట్టింది.
అది ఏంటంటే... పూరి డాటర్‌ని హీరోయిన్ చేయమని ఒకరిద్దరు దర్శకులు పూరి, లావణ్య దంపతులని సంప్రదించారట. కానీ.. వాళ్లు నో చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా పూరి డాటర్ పవిత్ర తెలియచేసారు. మరి... మీకు హీరోయిన్ అవ్వాలని ఇంట్రస్ట్ ఉందా అని అడిగితే... నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత అవకాశాలు వస్తే నటిస్తాను అని చెప్పింది.
అయితే... హీరోయిన్‌గా కాదట. నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తే నటిస్తానని చెబుతుంది. సో.. పూరి డాటర్ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయడం ఖాయం. కాకపోతే హీరోయిన్‌గా కాదు.