Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలబ్రటీ కాబట్టి నాన్నపై రాళ్లు విసరద్దు.. నోరు జాగ్రత్త అన్న పూరీ కుమార్తె

సెలబ్రిటీలు కాబట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, రాస్తే, టీవీల్లో ప్రసారం చేస్తే వారి కుటుంబాలు, వారి గౌరవ మర్యాదలు ఏమైపోతాయో దయచేసి ఆలోచించండి అంటూ ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర అభ్యర్థించారు. ఇతరుల గురించి రాసేటప్పుడు నిజాలు

Webdunia
సోమవారం, 17 జులై 2017 (03:55 IST)
సెలబ్రిటీలు కాబట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, రాస్తే, టీవీల్లో ప్రసారం చేస్తే  వారి కుటుంబాలు, వారి గౌరవ మర్యాదలు ఏమైపోతాయో దయచేసి ఆలోచించండి అంటూ ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర అభ్యర్థించారు. ఇతరుల గురించి రాసేటప్పుడు నిజాలు తెలుసుకోకుండా ఇతర్లమీద నిందలు వేయవద్దని ఆమె హెచ్చరించారు.
 
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించటం పై ఆయన కూతురు పవిత్ర పూరి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇతరులు గురించి వార్తలు రాసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిజం తెలుసుకోకుండా ఇతర మీద నిందలు వేయోద్దు.కేవలం మా నాన్న సెలబ్రిటీ అయిన కారణంగా ఆయన మీద పుకార్లు సృష్టించటం కరెక్ట్ కాదు. ఆయన మీద నిందలు వేసే ముందు ఆయన కుటుంబం గురించి వారి గౌరవ మర్యాదల గురించి ఆలోచించండి అన్నారు పవిత్ర.
 
నేను మాట్లాడేది పనీ పాట లేకుండా పిచ్చి మాటలు మాట్లాడే వారి గురించి మాత్రమే. మా నాన్న ఉన్నత లక్ష్యాలతో పనిచేసే వ్యక్తి. ఓ దర్శకుడిగా ఆయన ఆలోచనే ఆయన పెట్టుబడి, భవిష్యత్తు.అలాంటిది ఆయన కెరీర్ ను ఆయనే ఇలాంటి అలవాట్లతో ఎందుకు నాశనం చేసుకుంటాడు.గుర్తుంచుకోండి సెలబ్రిటీ అంటే పబ్లిక్ పర్సనాలిటీ కాదు. మా నాన్నకు డ్రగ్స్ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. జాగ్రత్తగా మాట్లాడండి.' అంటూ ఘాటుగా తన అభిప్రాయాలను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది.
 
దీనికంటే ఆమె ఇచ్చిన ఫినిషింగ్ టచ్ మీడియా విశ్వసనీయతకు సవాల్ విసురుతోంది. న్యూస్ చానల్స్ చూపుతున్న నానా చెత్తను దయచేసి నమ్మవద్దు. ఏదైనా మాట్లాడేముందు కాస్త ఆలోచించండి అంటూ పవిత్ర ముగించింది. 
 
పవిత్ర పూరి ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ పై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తెలుగు న్యూస్ చానల్స్‌లో కులరహిత సమాజం కోసం అంటూ దశాబ్దకాలంగా బండప్రచారం చేస్తున్న ఆ ఓవరాక్షన్ చానల్‌పై నెటిజన్లు విరుచుకు పడ్డారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments