Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీ నాకేమీ కొత్తకాదే!.. కానీ, అక్కడ సిగ్గుగానే ఉంటుంది : ప్రియాంకా చోప్రా

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగే ఉండాలన్న సూక్తిని నూటికి నూరుపాళ్ళూ పాటించేస్తోంది బాలీవుడ్‌ భామ ప్రియాంకా చోప్రా. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుని ఆ తర్వాత హాలీవుడ్‌లో పాదం మోపింది ప్రియాం

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (13:33 IST)
రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగే ఉండాలన్న సూక్తిని నూటికి నూరుపాళ్ళూ పాటించేస్తోంది బాలీవుడ్‌ భామ ప్రియాంకా చోప్రా. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుని ఆ తర్వాత హాలీవుడ్‌లో పాదం మోపింది ప్రియాంక. ఇక్కడ ఉన్నప్పుడు కొద్దిగా పద్ధతిగా ఉన్నట్టు కనిపించినా, హాలీవుడ్‌కి వెళ్ళిన తర్వాత బికినీలో అదరగొట్టేస్తోంది. అంతేకాకుండా తన బికినీ ఫో‍‍‍టోలు సోషల్‌ మీడియాలో పెట్టేస్తోంది. ఈ బికినీలపై ఆమె స్పందిస్తూ... 
 
బికినీలు వేసుకోవడం నాకేమీ కొత్తకాదే! గతంలో బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో బికినీలో కనిపించాను, ఇప్పుడు ఈ సినిమాలోనూ వేసుకున్నాను. తెర మీద వాటిని వేసుకోవాలంటే సిగ్గుగా అనిపించదు కానీ, బాహాటంగా బీచ్‌లో తిరగాలంటే సిగ్గుగా ఉంటుంది. ఆ ఫీలింగ్‌ ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. 
 
బేవాచ్ చిత్రం గురించి స్పందిస్తూ ఈ సినిమా నాకు మొదటి సినిమా కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నటిస్తూనే ఉన్నాను. హాలీవుడ్‌లో నా మొదటి సినిమా కావడంతో చాలామంది ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు. అందరూ అనుకుంటున్నట్టుగా నా మీద ఎలాంటి ఒత్తిడీ లేదు. నేను నా శక్తిని నమ్ముకుని సినిమాలు చేశాను... చేస్తున్నాను. 
 
నా కెరీర్‌ మొత్తంలో నేను ఎవరిమీదా ఆధారపడలేదు. సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేశానో, ఫ్లాప్‌నీ అలాగే తీసుకుంటాను. ఒక సినిమా ఫ్లాప్‌ అయితే చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తరువాత చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ రోజు ఈ స్థాయికి చేరుకోవడానికి అదే కారణం అని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం