Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ - పరశురాం కాంబో ... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? (video)

Webdunia
బుధవారం, 20 మే 2020 (09:08 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం ప్లాన్ జరుగుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి మహేష్ బాబు పరశురామ్ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పాడు. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే... ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా చాలా తక్కువ మందితో.. గెస్ట్‌లు ఎవరూ లేకుండా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా అఫిషియల్‌గా ప్రకటించలేదు కానీ.. కన్ఫర్మ్ చేసారని సమాచారం. 
 
మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ కాలేజ్ స్టూడెంట్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. 'మహర్షి' సినిమాలో మహేష్ కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించారు. ఈ సినిమాలో కూడా కాలేజ్ స్టూడెంట్‌గా నటించనున్నాడని టాక్ రావడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తితో ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
 
త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న మహేష్‌ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తాడని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. మరి... మహేష్ - పరశురామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నారో చూడాలి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments