Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బీబీ3' కోసం 'కంచె' భామ : ప్రగ్యాపై మోజుపడిన బాలయ్య!

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (11:16 IST)
యువరత్న బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. వర్కింగ్ టైటిల్ "బీబీ3". ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు కాగా, అందులో ఒక హీరోయిన్‌ను ఖరారు చేశారు. ఇపుడు మరో హీరోయిన్‌ను ఖరారు చేశారు. ఆమె పేరు ప్రగ్యా జైశ్వాల్. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ నటించిన 'కంచె' చిత్రంలో తొలిసారి తళుక్కున మెరిసింది. ఆ తర్వాత "మిర్చిలాంటి కుర్రోడు, గుంటూరోడు" తదితర చిత్రాల్లో నటించింది. అలాగే, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు - అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శ్రీరామదాసు చిత్రంలోనూ మెరిసింది. 
 
ఇపుడు బాలయ్య సరసన నటించేందుకు ఆమెను ఎంపిక చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవల టాలీవుడ్‌లో కాస్త వెనుకపడిన ప్రగ్యకు కెరీర్ పరంగా ఈ అవకాశం హెల్ప్ అవుతుందనే చెప్పచ్చు. ఇదిలావుంచితే, ఇందులో మరో కథానాయికగా మలయాళ సుందరి పూర్ణను ఇప్పటికే తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. 'సింహా', 'లెజండ్' వంటి హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనికి ఎంతో క్రేజ్ ఏర్పడింది.
 
వాస్తవానికి ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే, అంతలోనే ఆమె బాలయ్య పక్కన సరిపోవడం లేదంటూ, ఆమెను వద్దనుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇపుడు ప్రగ్యాను ఫైనల్ చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments