Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ పెళ్లిని అడ్డుకున్న రాజమౌళి... జక్కన్న స్వార్థం... 'బాహుబలి'ని కట్టిపడేసిందట.. నిజమేనా?

ప్రభాస్... టాలీవుడ్ స్టార్ కాదు.. జాతీయ స్టార్. అదీకాదు.. ఇంటర్నేషనల్ స్టార్. 'బాహుబలి' అనే ఒక్క చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీనికి కారణం దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి. ఈ దర్శకధీరుడు చ

Webdunia
గురువారం, 4 మే 2017 (16:53 IST)
ప్రభాస్... టాలీవుడ్ స్టార్ కాదు.. జాతీయ స్టార్. అదీకాదు.. ఇంటర్నేషనల్ స్టార్. 'బాహుబలి' అనే ఒక్క చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీనికి కారణం దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి. ఈ దర్శకధీరుడు చెక్కిన 'బాహుబలి', 'బాహుబలి 2' దృశ్యకావ్యాల్లో ప్రభాస్ హీరో. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఐదేళ్ళ సమయాన్ని ప్రభాస్ కేటాయించాడు. ఇపుడు ఈ కష్టానికి తగిన ఫలితాన్ని ప్రభాస్ ఎంజాయ్ చేస్తున్నాడు. 
 
అయితే, ఈ ఐదేళ్ళ కాలంలో ప్రభాస్‌కు వేలాది పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయట. వాటన్నింటికీ దర్శకుడు రాజమౌళి బ్రేక్ వేశారట. రాజమండ్రి, భీమవరంకు చెందిన ప్రముఖుల కుమార్తెల ప్రొఫైల్స్ కుటుంబ సభ్యులు ప్రభాస్ ముందు పెట్టగా వాటన్నింటిని బాహుబలి సున్నితంగా తిరస్కరించారట. కొన్నిసార్లు అయితే ప్రభాస్‌ ఇష్టపడింది ఈ అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు హల్‌చల్ చేశాయి. 
 
వాస్తవానికి బాహుబలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ప్రభాస్‌తో కుటుంబ సభ్యులు పెళ్లి ప్రస్తావన తెచ్చారట. ప్రభాస్ ముందు దాదాపు 6 వేల పెళ్లి ప్రతిపాదనలు ముందు ఉంచారట. కానీ ప్రభాస్ మాత్రం అప్పుడు బాహుబలి మాయలో పడిపోయారట. బాహుబలి తప్పా మరో అంశం డార్లింగ్ మనసును కట్టిపడేయకపోవడంతో ఆ ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలయ్యాయనేది సమాచారం. బాహుబలి పూర్తయ్యేవరకు పెళ్లి చేసుకోనని కుటుంబ సభ్యులకు సూచించారనేది అప్పట్లో సమాచారం. 
 
దీంతో ప్రభాస్ పెళ్లి రెండేళ్లు వాయిదా వేస్తే నష్టమేమీ లేదని అంచనాకు వచ్చారు. కానీ, రెండేళ్ల తర్వాత పెళ్లి చేద్దామనుకున్న ప్రభాస్ కుటుంబ సభ్యుల ఆశలపై దర్శకుడు రాజమౌళి నీళ్లు చల్లాడట. 'బాహుబలి 2'ను తెరపైకి తెచ్చి పెళ్లి ప్రస్తావనను మరో రెండేళ్లు వాయిదా వేయించారట. అలా ప్రభాస్ పెళ్లి అనూహ్యంగా ఐదేళ్లు వాయిదా పడింది. ఈ ఐదేళ్ళ కాలంలో ప్రభాస్‌కు 6 వేల ప్రతిపాదనలు వచ్చాయట. అంటే తన డ్రీమ్ ప్రాజెక్టును పూర్తి చేసేంతవరకు హీరో మనసును మరోదానిపై లగ్నం చేయకుండా దర్శకుడు కట్టడి చేశాడట. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments