Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ బడ్జెట్.. భారీ బరువులోనూ బాహుబలి-2 రికార్డు: 130 కేజీలు పెరిగిన ప్రభాస్

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (09:47 IST)
భారీ బడ్జెటే కాదు.. భారీ బరువులోనూ 'బాహుబలి- 2' టాలీవుడ్‌లో రికార్డు సృష్టించబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి-2' సినిమా కోసం ప్రభాస్ భారీగా బరువు పెరిగాడు. ఇప్పుడు ప్రభాస్ బరువెంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇప్పుడు ప్రభాస్ సరిగ్గా 130 కేజీల బరువు పెరిగాడట. 6 నెలలు కఠినమైన వ్యాయామాలు, ఆహారం పరంగా నియమాలు పాటించి ఈ పాత్రకు కావాల్సినంత బరువుని సాధించాడట ఈ యంగ్ రెబల్‌స్టార్.
 
పాత్రకనుగుణంగా బాహుబలిలో భారీకాయంతో కనిపించడానికి ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడట. కోటిన్నర వ్యయంతో అధునాతన సామాగ్రిని అమెరికా నుంచి తెప్పించుకొని తన ఇంటిలో సొంత జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆహారపరంగా ప్రత్యేకమైన నియమాల్ని పాటించారు. ఒక సినిమా కోసం ఇంతగా శారీరక శ్రమ తీసుకున్న హీరో ఎవరూలేరని అందరూ అనుకుంటున్నారు. తాజా సీక్వెల్‌లో మరింత భారీ దేహధారుడ్యంతో కనిపించబోతున్నారట. 
 
సినిమాలోని కొన్ని ప్రధాన ఘట్టాల్లో ప్రభాస్ అతిభారీకాయుడుగా కనిపిస్తాడట. అందుకోసం మరింత బరువుపెరగాలని దర్శకుడు రాజమౌళి సూచించాడట. దీంతో ఓవైపు షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు శారీరకంగా కఠోరమైన సాధన చేస్తున్నాడట ప్రభాస్. బరువు పెరగడంతో పాటు కండలు తిరిగిన దేహంతో అసలుసిసలైన జానపద నాయకుడిగా కనిపించాలనే లక్ష్యంతో సీక్వెల్ కోసం ప్రభాస్ తీవ్రంగా శ్రమిస్తున్నాడని సినీ నిపుణులు అంటున్నారు. ప్రభాస్ సరికొత్త అవతారం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిస్తుందో తెలియాలంటే సినిమా తొలి ప్రచార చిత్రం విడుదలయ్యేవరకు వేచిచూడాల్సిందే అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments