ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీ అప్‌డేట్స్ ఏంటంటే...

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (16:49 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
నిజానికి ఈ చిత్రం షూటింగ్ కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఆసుపత్రి సెట్స్ వేశారు. వచ్చే నెల ద్వితీయార్థం నుంచి షూటింగు నిర్వహించాలని షెడ్యూల్ కూడా వేసుకున్నారు.
 
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూరప్‌లో టూరిజం విషయంలో నిబంధనలను సడలిస్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని చిత్రం యూనిట్ భావిస్తోందట. దీంతో మొదట్లో అనుకున్నట్టుగానే ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. 
 
ఇందుకోసం చార్టెడ్ ఫ్లయిట్‌ను బుక్ చేసుకుని యూనిట్‌ని అక్కడికి తరలించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ముందుగా ఇటలీలో షూటింగ్ చేస్తారా? లేక రామోజీ ఫిలిం సిటీలో సెట్స్‌లో చేస్తారా? అన్న విషయంలో త్వరలో స్పష్టత వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments