Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ.. ఛీ... బోడిమూతి ప్రభాస్... అలాగైతే 'సాహో'...

ప్రభాస్... అంటే కోరమీసం... బాహుబలిలో అమరేంద్ర బాహుబలి వీరుడిగా కనిపించి కత్తిలా నటించాడు. ఐతే తదుపరి చిత్రం సాహోపైన అనేక రూమర్లు వస్తున్నాయి. తాజాగా సాహోలో ప్రభాస్ ఇలా వుంటాడంటూ ఓ గెటప్ హల్ చల్ చేస్తోంది. ఆ గెటప్ చూసిన నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు కొ

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (12:36 IST)
ప్రభాస్... అంటే కోరమీసం... బాహుబలిలో అమరేంద్ర బాహుబలి వీరుడిగా కనిపించి కత్తిలా నటించాడు. ఐతే తదుపరి చిత్రం సాహోపైన అనేక రూమర్లు వస్తున్నాయి. తాజాగా సాహోలో ప్రభాస్ ఇలా వుంటాడంటూ ఓ గెటప్ హల్ చల్ చేస్తోంది. ఆ గెటప్ చూసిన నెటిజన్లు తీవ్రమైన కామెంట్లు కొడుతున్నారు. ఇంతకీ ఆ గెటప్ ఎలా వుందయ్యా అంటే... మీసాలు తీసేసి క్లీన్ షేవ్ చేసేసి కనబడుతున్నాడు ప్రభాస్. ఈ గెటప్ చూసిన ఫ్యాన్...  ఛీ... ఛీ.. బోడిమూతి ప్రభాస్... ఇలాగైతే సాహో బాక్సాఫీస్ వద్ద బోర్లా పడుతుందంటూ కామెంట్లు కొడుతున్నారు. ఇంతకీ ప్రభాస్ మీసాలు తీయాల్సిన అవసరం ఎందుకొచ్చిందీ...?
 
బాహుబలి చిత్రంతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఉత్తరాది వారికి హీరో మీసాలు లేకుండా వుంటే ఇష్టపడతారు. అందువల్ల రాబోయే చిత్రంలో ప్రభాస్ మీసాలు తీసేసి కనబడటం ద్వారా ఉత్తరాది వారిని ఆకట్టుకోవాలని అనుకుంటున్నాడట. ఐతే మీసాలు తీసేస్తే కొందరి ముఖాలు బాగోవు. అలాంటి వారిలో హీరో నాగార్జున కూడా ఒకరు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మీసాలు తీసి నటించేందుకు ఇష్టపడరు. 
 
అంతేకాదు... తనకు గతంలో హిందీ అవకాశాలు వచ్చినా మీసాలు తీయాలని అన్నందుకు ఆ ఛాన్సులు వదులుకున్నాడు. ఐతే ఇప్పుడు ప్రభాస్ మాత్రం మీసాలు తీసి నటించేందుకు అంగీకరించాడని అనుకుంటున్నారు. ఇలా తీసేసి బోడిమూతి వేసుకుని నటిస్తే ఉత్తరాదివారికి నచ్చవచ్చోమోకానీ దక్షిణాదిలో ప్రభాస్‌ను మీసాలు లేకుండా చూడటం చాలా కష్టం. మరలాంటప్పుడు ఆఫ్షన్ ఏంటి అనేది చూడాల్సి వుంది. అసలు ప్రభాస్ ఇలాంటి సాహసం చేస్తాడా అనేది ప్రశ్న.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments