Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

సెల్వి
గురువారం, 31 జులై 2025 (11:56 IST)
Power star
పవర్ స్టార్‌ అనే పేరిట కోలీవుడ్‌లో పేరు కొట్టేసిన ఎస్. శ్రీనివాసన్ అరెస్టయ్యాడు. సహాయక పాత్రలు, కామెడీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే పవర్ స్టార్‌ ప్రస్తుతం బడా మోసం కేసులో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసులు పవర్ స్టార్‌ను అరెస్టు చేశారు. రూ.1000 కోట్లు రుణం ఇప్పిస్తానని చెప్పి.. ఓ సంస్థ నుంచి సుమారు రూ.5 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
ఒకవేళ రుణం ఇప్పించలేకపోతే తీసుకున్న డబ్బును తిరిగి 30 రోజుల్లోగా ఇస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం ఆ సంస్థ నుంచి తీసుకున్న డబ్బును తన సినిమా నిర్మాణాలకు, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఇక ఆయన చెప్పిన 30 రోజులు గడిచినా రుణం రాకపోయేసరికి ఆ సంస్థ యాజమాన్యం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ మేరకు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే నటుడు శ్రీనివాసన్‌ను ఢిల్లీ పోలీసులు ఇటీవల చెన్నైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అరెస్టు చేశారు. అనంతరం జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. 
 
కాగా అతనిపై చెన్నైలో ఇదే తరహాకు చెందిన మరో ఆరు కేసులు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా నటుడు శ్రీనివాసన్ ఇలాంటి ఒక కేసులో 2013లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు రూ.10 కోట్లు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చి బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. కానీ రూ.3.5 లక్షలు మాత్రమే ఇచ్చి పరారయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments