Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌పోర్టులో భార్యను బూతులు తిట్టి.. అరెస్టు అయిన ఆ హీరో ఎవరు?

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (09:19 IST)
సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, చిన్నపాటి పడక గది కలహాలు ఉండటం సహజం. అయితే, సెలబ్రిటీలుగా ఉండేవారు బయటకు వచ్చినప్పుడు.. ఎంతో హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో ఎన్ని గొడవలున్నప్పటికీ.. బాహ్య ప్రపంచం దృష్టిలో మాత్రం తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు నడుచుకుంటారు. 
 
కానీ, 'కుర్‌కురే' అనే చిత్రంలో హీరోగా నటించిన ఇంద్రసేన మాత్రం ఎయిర్ పోర్టు అనేది నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమనే కనీస జ్ఞానం కూడా మరచిపోయి.. తనను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన భార్యను బూతులు తిట్టడమే కాకుండా, ఆమెతో పెద్దగా వాగ్వావాదానికి దిగాడట. ఈయన అరుపులు కేకలు విన్న చుట్టుపక్కల వారు.. ఇక్కడేదో మహిళను కిడ్నాప్ చేస్తున్నారని భావించి పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
పోలీసులు వచ్చిన తర్వాత గానీ వారికి అసలు విషయం బోధపడలేదు. అది కిడ్నాప్ కాదని, వారు ఇద్దరూ భార్యాభర్తలేనని, గొడవ పడుతున్నారని అర్థమైంది. పోలీసుల కథనం ప్రకారం 'కుర్కురే' సినిమా హీరో ఇంద్రసేన విమానంలో ఇక్కడికి వచ్చారు. అతనిని రిసీవ్ చేసుకోవడానికి అతని భార్య విమానాశ్రయానికి వచ్చింది. ఆ హీరో, అతని భార్య మధ్య ఇంతకు ముందే మనస్పర్థలు ఉన్నాయి. 
 
విమానాశ్రయంలోనే వారు ఇద్దరు గొడవపడ్డారు. ఆ తర్వాత భార్యను బలవంతంగా కారులో ఎక్కించుకుని ఇంద్రసేన బయలుదేరాడు. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారని వివరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంద్రసేన కారును రాజేంద్ర నగర్ వద్ద ఆపి.. అతన్ని, అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments