Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఇంజనీర్ బాబు".. ‘ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే…’ అంటున్న పవన్ కళ్యాణ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "ఇంజనీర్ బాబు" ఫ్యాన్ మేడ్ టైటిల్‌ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ టైటిల్‌కు ‘ఇంటి పేరు – ఒంటి పేరు అ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (15:41 IST)
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "ఇంజనీర్ బాబు" ఫ్యాన్ మేడ్ టైటిల్‌ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ టైటిల్‌కు ‘ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే…’ అని ట్యాగ్ లైన్‌ను జతచేశారు. 
 
పవన్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రం గత నెలలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే రామోజీఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. 'జల్సా', 'అత్తారింటికి దారేది'వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ల తర్వాత వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా సిద్ధమవుతున్న ఈ సినిమాను, ఈ ఏడాది దసరాకు విడుదల చేయనున్నారు. 
 
పైగా, పవన్ నటిస్తున్న 25వ చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే ఇది చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కాదు, పవర్ స్టార్ అభిమాని రూపొందించిన ఫస్ట్ లుక్. 
 
అయితేనేం చిత్ర యూనిట్ మించిన క్వాలిటీ ఈ ఫస్ట్ లుక్‌లో ఉండడంతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. త్రివిక్రమ్ మూవీలో పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్నాడని వార్త బయటకు రావడంతో పవన్ కొత్త మూవీకి “ఇంజనీర్ బాబు” అని నామకరణం చేసి, ‘ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే…’ అని ట్యాగ్ లైన్ పెట్టి విడుదల చేసిన ఈ ‘ఫ్యాన్ మేడ్’ పోస్టర్ వైరల్‌గా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments