Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ పై సణుగుడు... రేణూ దేశాయ్ మళ్లీ మొదలెట్టింది...

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:49 IST)
రేణూ దేశాయ్ మొన్నటిదాకా ఇష్క వాలా కాదల్ చిత్రం ఆడియో, టీజర్ రిలీజ్ లకు పవన్ కళ్యాణ్ పేరును పదేపదే వాడుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తెగ చర్చ నడుస్తోంది. కొందరు కుర్రాళ్లు పనిగట్టుకుని పవన్ ఇమేజ్ బాగా క్యాష్ చేసుకుంటున్నారంటూ కామెంట్లు విసరడంపై రేణూ చిటపటలాడింది.
 
తాను ఇష్క్ వాలా కాదల్ చిత్రం కంటే ముందే ఓ బిగ్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. ఐనా అంతకుముందే తాను ఓ మోడల్ గా, నటిగా అందరిలో పేరు ఉందని గుర్తు చేశారు. కాబట్టి తాను ఎవరి పేరును వాడుకుని పాపులారిటీ చెందాల్సిన పనిలేదంటూ మండిపడింది. అంతేకాదు.. తన గత చిత్రం సూపర్ హిట్ అయినపుడు పవన్ కళ్యాణ్ గారు తనకు ఫోన్ చేసి మెచ్చుకున్నారని కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 
 
ఐతే కొంతమంది మాత్రం తమ బుర్రలలో అతి తెలివిని ప్రదర్శిస్తూ ఏవో తోచిన రాతలు రాస్తున్నారనీ, వారంతా ఇకనైనా ఈ విషయంపై కాక మరే ఇతర అంశంపైన దృష్టిపెడితే బావుంటుందని చెప్పుకొచ్చారు. అంటే... పవన్ కళ్యాణ్ బ్రాండును రేణూ దేశాయ్ వాడుకోవట్లదన్నమాట. నమ్మేద్దామా...?

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments