క్రిష్‌తో ఓపెన్‌గా ఆ విషయాన్ని మాట్లాడేసిన పవన్ కళ్యాణ్‌

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (22:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త గ్యాప్ తీసుకుని సినీరంగంలోకి మళ్ళీ వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం మళ్ళీ సినిమాలను ఎంచుకున్నారు. అలా అని రాజకీయాలను వదిలిపెట్టలేదు. గ్యాప్ దొరికితే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
 
ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమాతో పాటు క్రిష్ దర్సకత్వం వహించే సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారట. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాదు హరీష్ శంకర్ దర్సకత్వంలోను ఒక సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. దీంతో బిజీబిజీగా ఉన్నారాయన.
 
అయితే క్రిష్‌‌తో సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతనితో మనసు విప్పి మాట్లాడారట. ఇంతకుముందే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. దీంతో రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వివరించారట. అలాగే తిరిగి సినీరంగంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందోనని కూడా చెప్పారట.
 
దీంతో క్రిష్‌ అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు ఏదీ ఆలోచించకండి. ఆర్థిక పరిస్థితి కుదుటపడేందుకే కదా మీరు మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. ఇది అందరికీ తెలిసిందే. విమర్సలు చేసే వారు చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోవద్దండి అంటూ సర్దిచెప్పారట క్రిష్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్ష పేపర్ ఇస్తాను.. కోరిక తీర్చు : విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన తాతయ్య, వీడియో

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తమిళనాడులో విస్తారంగా వర్షాలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

వేసవిలో డీహైడ్రేషన్‌ రాకుండా వుండాలంటే...?

తర్వాతి కథనం
Show comments