Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గబ్బర్ సింగ్' కోసం కుర్రపిల్లను ఫిక్స్ చేసిన హరీశ్ శంకర్?!

Webdunia
మంగళవారం, 12 మే 2020 (13:52 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ విరామం తర్వాత వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం పింక్‌ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా సింహ భాగం పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా వాయిదావేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం వచ్చే దసరా లేదా దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది. 
 
మరోవైపు, గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ ఓ చిత్రాన్ని తెరెక్కించనున్నారు. ఇందులో పవన్ హీరో కాగా, హీరోయిన్ కోసం దర్శకుడు టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్‌లలో శోధించి, చివరకు మానస రాధాకృష్ణన్ అనే హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
కేరళలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. దుబాయ్‌లో పెరిగింది. ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో 'పరమగురు' సినిమా చేస్తోంది. పవన్‌తో చేసే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. 
 
నిజానికి తెలుగు వెండితెరపై మలయాళ బ్యూటీలు రాజ్యమేలుతున్నారని చెప్పొచ్చు. నయనతార, కీర్తిసురేష్, అమలాపాల్, ఇలా అనేక మంది తారలు రాణిస్తున్నారు. ఈ భామలు అందం .. అభినయంతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ తమ హవాను సాగిస్తున్నారు. ఈ కోవలోనే మానస రాధాకృష్ణన్ కూడా తెలుగు తెరకు పరిచయంకానంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చకచక సాగిపోతున్న పాకిస్థాన్ జాతీయుల వీసాల రద్దు...

Altaf Lali: లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లాలి మృతి

AP Spouse Pension Scheme: విడో పెన్షన్లు.. ఏపీ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.. నెలకు రూ.4,000

ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరి రంగన్ కన్నుమూత

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments