Webdunia - Bharat's app for daily news and videos

Install App

సప్తగిరి చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఆడియో రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శ

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (14:12 IST)
కమెడియన్‌గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపుతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ముగించి త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత డాక్టర్ రవికిరణ్ వెల్లడించారు. 
 
అలానే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ టీమ్ త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్స్ జరుపుకోనుందని తెలిపారు. అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో దీన్ని పుకారుగా కొట్టిపారేసినా ఈ వార్త నిజమయ్యే అవకాశాలు లేకపోలేదండోయ్. 
 
ఎందుకో తెలుసా... పవన్ నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' టైటిల్‌ని సప్తగిరి అండ్ టీమ్ తమ చిత్రం కోసం చేయించుకున్నాడట. అయితే పవన్ టీమ్ అడగడంతో త్యాగం చేసి ఇప్పుడు సప్తగిరి ఎక్స్‌ప్రెస్ అనే టైటిల్‌ని పెట్టినట్టు సమాచారం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేగాక అరుణ్ పవర్‌కి ఇండస్ట్రీ బిగ్ హెడ్స్‌తో పరిచయం ఉండడంతో ఈ వార్తలు నిజమవ్వనుందని అంచనా వేయబడుతుంది. ఇదేగనుక జరిగితే సప్తగిరి బంపర్ ఆఫర్ కొట్టినట్టే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments