Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పెళ్లి ఫుటేజీల విలువ రూ.100 కోట్లు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:50 IST)
బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ఉమెన్‌గా ఉన్న హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన ప్రియుడు విక్కీ కౌశల్‌ను ఆమె పెళ్లాడనున్నారు. అయితే, ఈ పెళ్ళికి సంబంధించి వీడియో ఫుటేజీల కోసం బడా ఓటీటీ కంపెనీల మధ్య తీవ్రపోటీ నెలకొనివుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ ఫుటేజీలను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాయి. ప్రాథమికంగా, ఈ ఫుటేజీల ధర రూ.100 కోట్ల వరకు పలికినట్టు సమాచారం. 
 
నిజానికి తన ప్రియుడు, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ను ఆమె గత యేడాదే పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ కరోనా పరిస్థితుల ఆమె కోరిక నెరవేరలేదు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి త్వరలోనే రాజస్థాన్ రాష్ట్రంలోని ఎంతో చారిత్రాత్మకమైన రాయల్ ప్యాలెస్‌లో ఈ వివాహం జరుగనుంది. గత నెల రోజులుగా ఈ పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ వివాహానికి ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ప్యాలెస్ వైపు వచ్చే చిన్నపాటి రోడ్లను కూడా బ్లాక్ చేశారు. అలాగే, భద్రతను కూడా భారీ స్థాయిలో పెంచారు. 
 
ఈ నేపథ్యంలో ఈ పెళ్లి ఫోటోలు, ఫుటేజీల కోసం భారీ ధరను చెల్లించేందుకు అనేక మీడియా సంస్థలు ముందుకు వచ్చాయి. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. ఈ పెళ్లి వీడియో ఫుటేజీలు రూ.100 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఓ కంపెనీ ముందుకు వచ్చినట్టు సమాచారం. కాగా, గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో కత్రినా కైఫ్ ప్రేమాయణం కొనసాగించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ వచ్చింది. ఇపుడు మరో హీరో విక్కీ కౌశల్‌ను కత్రినా పెళ్ళాడేందుకు సిద్ధపడటంతో ఈ వివాహ ఫుటేజీకి భారీ డిమాండ్ ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments