Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ద‌ర్శ‌కుడు మారాడా..? అతడెవరో తెలిస్తే షాక్...

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతి రోజైన జ‌న‌వ‌రి 18న లాంఛ్ చేసారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రి

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (17:19 IST)
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతి రోజైన జ‌న‌వ‌రి 18న లాంఛ్ చేసారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. అయితే.... ఎన్టీఆర్ వ‌ర్ధంతి రోజున టీజ‌ర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. దీని కోసం బాల‌య్యపై తేజ కొన్ని సీన్స్‌ కూడా చిత్రీక‌రించాడు. రామ‌కృష్ణ సినీ స్టూడియోలో షూటింగ్ చేసారు. 
 
అంతా బాగానే ఉంది... టీజ‌ర్ రిలీజ్ చేస్తారు అనుకుంటే.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. కార‌ణం ఏమిటంటే... తేజ షూట్ చేసిన టీజ‌ర్ బాల‌య్య‌కు సంతృప్తి క‌లిగించ‌లేద‌ట‌. దీంతో టీజ‌ర్ ప్లేస్‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఆత‌ర్వాత తేజ వెంక‌టేష్‌తో సినిమాని ప్రారంభించాడు. ఇది పూర్తి చేసి బాల‌య్య‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్ స్టార్ట్ చేయాల‌నుకున్నాడు. 
 
అయితే... వెంకీ మూవీలో తేజ బిజీ కావ‌డం... ఎన్టీఆర్ బ‌యోపిక్ పైన అంత‌గా ఇంట్ర‌ెస్ట్ చూపించ‌క‌పోవ‌డంతో తేజ‌ను త‌ప్పించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 
 
ఇంత‌కీ తేజ ప్లేస్‌కు ఎవ‌రు వ‌చ్చారంటే... బాల‌య్యే డైరెక్ట్ చేయాల‌నుకుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఇది ఎంతవ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

గాజువాక చిరు వ్యాపారుల సిగపట్టు... అడ్డుకోబోయిన వ్యక్తికి దాడి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments