Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బ‌యోపిక్... లక్ష్మీ పార్వతి పాత్రలో సీనియ‌ర్ న‌టి

ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీ ప్ర‌స్తుతం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మ

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (15:06 IST)
ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీ ప్ర‌స్తుతం సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నారు. వారాహి అధినేత సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి కూడా ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
నారా చంద్రబాబునాయుడు పాత్ర కోసం రానాని, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం సుమంత్‌ని తీసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమె ఎవ‌రో కాదు ఆమ‌ని. ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి స్థానం గురించి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయ‌ట‌. ఆ పాత్ర‌కు ఆమె క‌రెక్ట్‌గా స‌రిపోతుంద‌ని  ఆమనిని సంప్రదించారట. 
 
తొలుత లక్ష్మీపార్వతి ప్రస్థావన ఉండదనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఆమనిని తీసుకున్నారనే వార్తలు రావడంతో క్రిష్ ఆ పాత్ర‌ను ఎలా చూపిస్తార‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. మరి దీనిపై లక్ష్మీపార్వతి ఏమయినా మాట్లాడుతారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments