Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్: సుమంత్... అక్కినేనిగా మీరేంటి? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా స‌క్స‌స్‌ఫుల్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో బాల‌కృ

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (18:18 IST)
ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా స‌క్స‌స్‌ఫుల్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ న‌టించ‌డంతో పాటు ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాలో అక్కినేని పాత్ర‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే.. ఈ పాత్ర‌ను ఎవ‌రు పోషించనున్నారు అనేది గ‌త కొన్ని రోజులు నుంచి ఆస‌క్తిగా మారింది. నాగార్జున‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకరు న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. 
 
ఆ త‌ర్వాత సుమంత్ న‌టించ‌నున్నాడు అని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఎట్టేకేల‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేనిగా సుమంత్ న‌టించ‌నున్నాడ‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంతమంది అక్కినేని అభిమానులు ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... సుమంత్... అక్కినేనిగా మీరేంటి? అక్కినేని ఆత్మ ఘోషిస్తుంటుంది అని కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఎందుకంటే... అక్కినేనికి, బాల‌య్య‌కి మ‌ధ్య ఓ ఫంక్ష‌న్‌లో మాటామాటా పెర‌గ‌డం... ఆ త‌ర్వాత రెండు ఫ్యామీలిలకి మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డం జ‌రిగింది. మ‌రి... ఈ వార్త‌లపై సుమంత్ ఏమ‌న్నా స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments