ఎన్టీఆర్, వైఎస్సార్ బయోపిక్స్ వ‌చ్చేది ఒకే రోజునా?

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చి ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోప

Webdunia
బుధవారం, 30 మే 2018 (13:11 IST)
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చి ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా సెట్స్ పైకి వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ 2019 సంక్రాంతి నాటికి దాన్ని విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.
 
ఇక మరోవైపు దర్శకుడు మహి వి రాఘవ్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో దివంగ‌త నేత వై.ఎస్.రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ రూపొందుతోంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం జూలైలో రెగ్యుల షూట్‌కు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కూడా 2019 సంక్రాంతి నాటికి విడుదల చేసే యోచనలో సదరు దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇలా ఇద్దరు ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్ ఒకేసారి విడుదల కానుండటం విశేషమనే చెప్పాలి. అయితే ఈ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇదే క‌నుక నిజ‌మై.. రెండు బ‌యోపిక్‌లు ఒకేసారి రిలీజ్ అయితే... ఏ బ‌యోపిక్ విశేషంగా ఆక‌ట్టుకుంటుందనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కేంద్ర బలగాలను మోహరించాలి.. ఆ విషయంలో ఈసీ మౌనం ఎందుకు? బీఆర్ఎస్

Gold: రూ. 15 లక్షల విలువ చేసే బంగారం హారం ఆటోలో మర్చిపోయిన దంపతులు, ఏం జరిగింది?

చీమలంటే భయం చచ్చిపోతున్నా.. పాప జాగ్రత్త.. అన్నవరం, తిరుపతికి 1116, ఎల్లమ్మకు ఒడిబియ్యం

బార్బర్ షాపులో వ్యక్తికి మెడ తిప్పుతూ మసాజ్, పక్షవాతం వచ్చేస్తుందా? (video)

Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం.. అమిత్ షా, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments