Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవా...? ఎవరాయన? ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ హీరో రెబల్ స్టార్ నట వారసుడిగా సినీరంగప్రవేశం చేశారు ప్రభాస్. తన పెదనాన్న ద్వారా వచ్చిన బరువైన బాధ్యతను తన భుజస్కందాల ద్వారా మోస్తూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యంగ్ రెబల్ స్టార్‌గా టాప్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్నారు.

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (11:10 IST)
సీనియర్ హీరో రెబల్ స్టార్ నట వారసుడిగా సినీరంగప్రవేశం చేశారు ప్రభాస్. తన పెదనాన్న ద్వారా వచ్చిన బరువైన బాధ్యతను తన భుజస్కందాల ద్వారా మోస్తూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యంగ్ రెబల్ స్టార్‌గా టాప్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్నారు.
 
దర్శక ధీరుడు అద్భుత సృష్టి బాహుబలిలో నటించాక ప్రభాస్ ఖ్యాతి ప్రపంచానికి విస్తరించింది. తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలుగు హీరో స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి తెలియజేసిన సినిమా బాహుబలి. ఈ చిత్రానికి తన నటనతో ప్రాణం పోశాడు ప్రభాస్. అయితే తాను ఎంత ఎదిగినా ప్రభాస్‌లో కించిత్ గర్వం కూడా ఎవరికీ కనిపించదు. సినీ పరిశ్రమలో తనకంటే పెద్ద స్థాయిలో ఉన్నవారినైనా, క్రిందిస్థాయిలో ఉన్నవారినైనా డార్లింగ్ అని ఆప్యాయంగా పిలుస్తూ అందరికీ అజాత శత్రువుగా మారిపోయారు ప్రభాస్. అందుకే ప్రభాస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం.
 
ప్రభాస్‌కు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం. సినీ పరిశ్రమలో కంటే ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో చిరు అంటే ప్రభాస్‌కు అమితమైన ఇష్టం. చిరంజీవి కూడా ప్రభాస్ పైన అభిమానం చూపుతుంటారు. అందుకే బాహుబలి షూటింగ్ సమయంలో నేరుగా వెళ్ళి ప్రభాస్‌తో మాట్లాడి వచ్చారు చిరంజీవి. 
 
చిరు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా గురించి స్నేహితులతో ప్రభాస్ మాట్లాడుతూ... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఏ సినిమా ప్రారంభిస్తే ఆ సినిమా ముగిసేంత వరకు నేను ఆయన్ను ఆ క్యారెక్టర్ లోనే ఊహించుకుంటాను. కాబట్టి ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఎవరో తెలియదు.. నాకు తెలిసిన వ్యక్తి 'సైరా నరసింహారెడ్డి' అని స్నేహితులతో అన్నారట. చిరుపై ఎంత ప్రేమ ఉంటే ప్రభాస్ ఇలా చెప్పి ఉంటారని స్నేహితులు అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments