Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి పార్ట్ 3 వస్తుందా? బుద్ధిపుడితే సీక్వెల్ తీసేస్తాడట..

బాహుబలి సినిమా తొలి పార్ట్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజైంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్ విడుదలైంది. మొదట ఒక

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (13:52 IST)
బాహుబలి సినిమా తొలి పార్ట్ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజైంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్ విడుదలైంది. మొదట ఒక నిమిషం 52 సెకన్ల నిడివి కలిగిన తమిళ ట్రైలర్‌ ఆన్‌లైన్‌లో బయటకొచ్చింది. ఆ తర్వాత రెండు నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగిన హిందీ ట్రైలర్‌ను కరణ్‌ జోహర్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. 
 
సినిమాపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ మైండ్‌ బ్లోయింగ్‌ వీఎఫ్‌ఎక్స్‌తో ట్రైలర్‌ రూపుదిద్దుకుంది. రమ్యకృష్ణ కాలిని ఎవరో తాకుతున్నట్లు మొదలైన తమిళ ట్రైలర్‌.. బాహుబలిని కట్టప్ప పొడిచి చంపడం.. లాంటి ఉత్కంఠ భరిత సీన్లతో ముందుకు సాగింది. అయితే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను పొడిగిస్తూ.. ప్రశ్నార్థకంగానే ఉంచేశారు. 
 
బాహుబలి-2లో ప్రభాస్‌, రానాలు ఈ సినిమాలో హీరో, విలన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, తమన్నాలు హీరోయిన్లు. ఆర్కా మీడియా వర్క్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
 
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే డౌట్‌తో ద బిగినింగ్ క్లోజైంది. కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చిందన్న దానికి పార్ట్2లో కంక్లూజన్ వస్తుంది. అయినా బాహుబలికి ముగింపులేదు. రాజమౌళి బాహుబలిని పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలుస్తోంది. వివిధ రూపాలు, డిజిటల్ ఫార్మాట్స్‌లో బాహుబలి సీక్వెన్స్ జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్‌లో మళ్లీ బుద్ధిపుడితే బాహుబలి మూడో సీక్వెల్‌కు రెడీ అయిపోతున్నాడని తెలిసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments