Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్క్రిప్ట్ నచ్చితే గ్లామర్‌గా నటిస్తా.. స్కిన్‌ షోకు దూరం.. ఎన్టీఆర్, బన్నీకి షాక్ ఇచ్చిన నాని హీరోయిన్!

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు 'జెంటిల్‌మన్' హీరోయిన్ నివేదా థామస్ ఓ కండిషన్ పెట్టింది. టాలీవుడ్ కుర్ర హీరోలతో నటించాలంటే.. తనకు స్క్రిప్ట్ నచ్చాలనీ, అపుడే... గ్లామర్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (19:29 IST)
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌కు 'జెంటిల్‌మన్' హీరోయిన్ నివేదా థామస్ ఓ కండిషన్ పెట్టింది. టాలీవుడ్ కుర్ర హీరోలతో నటించాలంటే.. తనకు స్క్రిప్ట్ నచ్చాలనీ, అపుడే... గ్లామర్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అయితే స్కిన్ షోకు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోనని చెప్పుకొచ్చింది.
 
ఈ చెన్నై బ్యూటీ.. యంగ్‌హీరో నాని సరసన 'జెంటిల్‌మన్'లో నటించింది. ఈ ఒక్క చిత్రంతోనే తన ఫేట్‌ను మార్చుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కాల్‌షీట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయట. స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం నివేదాతో వర్క్ చేయడానికి అమితాసక్తిని చూపుతున్నారు. 
 
దీపం ఉండగానే 'ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందం'గా.. ఏ హీరోయిన్ అయినా వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. అదేసమయంలో టాలీవుడ్ హీరోలకు కొన్ని కండిషన్లు పెడుతోంది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్- వక్కంతం వంశీ కాంబినేషన్‌లో సెట్స్‌పైకి వెళ్లే సినిమా కోసం నివేదా థామస్‌ను దర్శకుడు కలిసినట్లు తెలిసిందే. అయితే స్క్రిప్ట్ నచ్చితే గ్లామర్‌గా కనిపించడానికి అభ్యంతరం లేదని.. కానీ స్కిన్ షో మాత్రం చేసేది లేదని ముఖం మీదే చెప్పేసిందట. 
 
మరోవైపు బన్నీ- హరీశ్ శంకర్ మూవీ విషయంలో కూడా నివేదా నుంచి ఇదే సమాధానం వచ్చిందట. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకే ఎక్స్‌పోజింగ్ చేయనని నివేదా కండీషన్స్ పెట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. తన యాక్టింగ్‌పై ఎంత నమ్మకం ఉంటేనో ఇలాంటి షరతులు పెడుతోందని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments