Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ కురుక్షేత్రలో ద్రౌపదిగా నయనతార?

మలయాళంలో మహాభారతం ఆధారంగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో.. కన్నడంలో ''కురుక్షేత్రం'' పేరిట అత్యధిక భారీ బడ్జెట్‌తో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా జూలై 23 ను

Webdunia
బుధవారం, 5 జులై 2017 (12:09 IST)
మలయాళంలో మహాభారతం ఆధారంగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో.. కన్నడంలో ''కురుక్షేత్రం'' పేరిట అత్యధిక భారీ బడ్జెట్‌తో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా జూలై 23 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. సినీ యూనిట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా వుంది. ఇప్పటికే కన్నడ కురుక్షేత్రంలో దర్శన్ దుర్యోధనుడిగా, రవిచంద్రన్ శ్రీకృష్ణుడిగా ఎంపికయ్యారు. 
 
ఇక దక్షిణాది అగ్రతార నయనతార కురుక్షేత్రంలో ద్రౌపదిగా నటించనుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. శ్రీరామరాజ్యంలో సీతగా కనిపించిన నయనతార ఆ సినిమాకు గాను ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకుంది. 
 
తాజా కురుక్షేత్రంలో నయన ద్రౌపదిగా కనిపిస్తుందని.. ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహిస్తున్నాడు. మునిరత్న నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. కన్నడ అగ్రతారలు నటించబోతున్న ఈ చిత్రంలో ద్రౌపది పాత్ర కోసం నయనతారను ఇప్పటికే సంప్రదించారట. అయితే నయన ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని సమాచారం. మరి ద్రౌపది ఆఫర్‌ను నయన స్వీకరిస్తుందో లేదో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments