Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్ఫామ్.. జయలలిత సాక్షిగా విఘ్నేష్‌తో నయనతార బంధానికి క్లారిటీ ఎలా?

దక్షిణాది అగ్రతార నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో హీరో శింబు, దర్శకనటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో నయన్ ప్రేమాయణం నడిపింది. కానీ ప్రభుదేవాతో పెళ్ళ

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (14:28 IST)
దక్షిణాది అగ్రతార నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్‌తో సహజీవనం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో హీరో శింబు, దర్శకనటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో నయన్ ప్రేమాయణం నడిపింది. కానీ ప్రభుదేవాతో పెళ్ళాగి పోవడంతో మళ్లీ సినిమాల్లో పుంజుకున్న నయనతార, తాజాగా.. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో నయన్ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వీళ్లిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారని కోలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తుంది. ఇందుకు ఆధారంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 
తాజాగా నయనపై మరో ఆసక్తికరమైన విషయం కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో ఇటీవలే ఖరీదైన ఇంటిని నయనతార కొందట. ఈ ఇంట్లోనే విఘ్నేశ్‌తో నయనతార సహజీవనం చేస్తోందని తెలిసింది. కానీ పెళ్లి కాకుండానే నయన- విఘ్నేష్ సహజీవనం మొదలు పెట్టారా? అనే విషయంలో మాత్రం కొంచెం డివైడ్ టాక్ వినిపిస్తుంది.
 
అయితే.. న‌య‌న జ‌య‌ల‌లితకు నివాళులు అర్పించేందుకు వ‌చ్చి వేలాది మంది స‌మ‌క్షంలో ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది. జయలలిత పార్ధివ దేహాన్ని దర్శించుకోవడానికి అనేకమంది సినిమా సెలబ్రిటీలు క్యూలు కట్టిన నేపథ్యంలో.. బెంగ‌ళూరులో షూటింగ్‌లో ఉన్న నయనతార కూడా అర్ధాంతరంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ చెన్నై వ‌చ్చింది. 
 
జయలలిత మృత‌దేహానికి తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నివాళులు అర్పించింది. ఇద్దరూ కూడా తెల్ల బట్టల్లో వచ్చారు. దీనిని బట్టి నయన విఘ్నేష్‌ల మధ్య రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అని కోలీవుడ్ జనం చెవులు కొరుక్కుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని కాల్చి చంపిన రిటైర్డ్ ఎస్ఐ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments