కృష్ణవంశీ తన కొత్త చిత్రంలో హీరోయిన్ల కోసం వేట మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురి హీరోయిన్లను ఫోటోసెషన్ చేయడం.. ఇంకా ఎవరినీ ఫైనల్ చేయకపోవడం జరిగింది. నందితను కూడా ఫోటో సేషన్ చేశారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదని తెలిసింది. విశేషం ఏమంటే తెలుగు అమ్మాయికే ప్రిఫరెన్స్ ఇవ్వాలని కృష్ణవంశీ చూస్తున్నాడు.
అలాంటి అమ్మాయిల్లో దివ్యశ్రీ, నందిత, అంజలి వున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నందిత బాగా పాపులర్ అయింది. 'సావిత్రి' సినిమా ఇటీవలే నటించింది. ఇప్పుడేమో నిఖిల్‌తో ఒక సినిమా చేస్తోంది. అదికాకుండా ఇప్పుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న సినిమాలో.. నటిస్తున్నట్లు తెలిసింది. రెజీనా ఒక హీరోయిన్ అయితే నందిత మరో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.