Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి. రాజేందర్ దర్శకత్వంలో నమిత.. లేడీ విలన్‌గా?

సెక్సీతార, హీరోయిన్ నమిత తన బాయ్‌ఫ్రెండ్ వీరేన్ చౌదరిని మనువాడిన సంగతి తెలిసిందే. వివాహానంతరం నమిత సినిమాల్లో నటిస్తుందని.. చౌదరి గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో.. తన పెళ్లికి ముందు నమిత నటించిన ''పొట్టు

Webdunia
మంగళవారం, 22 మే 2018 (10:43 IST)
సెక్సీతార, హీరోయిన్ నమిత తన బాయ్‌ఫ్రెండ్ వీరేన్ చౌదరిని మనువాడిన సంగతి తెలిసిందే. వివాహానంతరం నమిత సినిమాల్లో నటిస్తుందని.. చౌదరి గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో.. తన పెళ్లికి ముందు నమిత నటించిన ''పొట్టు'' చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అలాగే నమిత వివాహానంతరం ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ప్రముఖ దర్శక నిర్మాత టి.రాజేందర్ నిర్మించనున్న ఓ చిత్రంలో నమిత నటించనున్నట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నమిత ప్రధానపాత్ర పోషిస్తోంది. ఇందులో నమిత లేడి విలన్‌గా కనిపిస్తుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
కాగా విజయకాంత్‌ నటించిన ''ఎంగల్‌ అన్నా'' చిత్రంతో తమిళతెరకు పరిచయమైన నటి నమిత.. కొన్నేళ్ల పాటు అగ్ర నాయికగా కొనసాగింది. కానీ కొంతకాలంగా ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గడంతో పాటు గత ఏడాది పెళ్లి కూడా కావడంతో.. ఇక నమిత సినీ కెరీర్ అంతేనని అందరూ భావించారు. అయితే ఇటీవల ఆడియో విడుదల కార్యక్రమాల్లో నమిత తళుక్కుమంటున్నారు. 
 
తాజాగా దాదాపు 11 ఏళ్ల తర్వాత టి.రాజేందర్‌ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఇందులో నమిత కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రాధారవి ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఇతర నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments