Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున వర్సెస్ మహేష్ బాబు, అసలు వీరిద్దరి మధ్య ఏమైంది?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (21:02 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ అంద‌రిలో ఆస‌క్తిని కలిగించిందని చెప్పచ్చు. ఈ సినిమా మేకింగ్ కూడా చాలా.. కొత్తగా ఉంటుందని.. ఇక ఈ సినిమా అయితే.. ఆడియన్స్‌కి ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది అంటున్నారు. 
 
ఇదిలా ఉంటే.. నాగ చైతన్యతో పరశురామ్ సినిమా చేయాలనుకోవడం.. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాని నిర్మించాలనుకోవడం తెలిసిందే. ఈ సమ్మర్ తర్వాత ఈ సినిమాని ప్రారంభించాలి అనుకున్నారు. ఇంతలో.. పరశురామ్‌కి మహేష్‌ బాబు నుంచి కాల్ రావడం.. మహేష్ సినిమా చేద్దామని ఆఫర్ ఇవ్వడంతో చైతన్య సినిమాని పక్కన పెట్టి పరశురామ్ మహేష్‌‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.
 
నాగచైతన్య పరశురామ్‌తో సినిమా చేయడానికి అంతా సెట్ చేసుకుని.. అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసి.. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్న టైమ్‌లో ఇలా మహేష్... పరశురామ్‌కి ఆఫర్ ఇవ్వడంతో నాగ్ కాస్త సీరియస్‌గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 
 
నాగ్ - మహేష్ బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే.. అక్కినేని ఫ్యామిలీ - ఘట్టమనేని ఫ్యామిలీ మధ్య మొదటి మంచి అనుబంధం ఉంది. అలాంటిది నాగ్ - మహేష్ మధ్య గ్యాప్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై నాగార్జున కానీ, మహేష్ కానీ స్పందించలేదు కానీ.. వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. మరి.. నాగార్జున కానీ.. మహేష్ కానీ.. స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments