Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకుతో పెళ్లి జరగాలంటే నాదో కండిషన్.. సమంతతో నాగార్జున

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత మధ్య ప్రేమ నడుస్తోందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే వాటిని నిజం చేస్తూ నాగచైతన్య, సమంత ఒకటి కాబోతున్నారు. డిసెంబర్‌లో వీరి పెళ్

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (10:30 IST)
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత మధ్య ప్రేమ నడుస్తోందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే వాటిని నిజం చేస్తూ నాగచైతన్య, సమంత ఒకటి కాబోతున్నారు. డిసెంబర్‌లో వీరి పెళ్లి జరగనుందని నాగార్జున ప్రకటించారు. నాగచైతన్య, సమంత ప్రేమే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సమంత సినిమాలు ఒప్పుకోవడం మానేయడంతో త్వరలోనే చైతన్యతో పెళ్లి కన్ఫామ్ అని వార్తలొస్తున్నాయి. 
 
నాగచైతన్యతో పెళ్లి కావాలంటే సినిమాలు వదిలేయాలనేది నాగార్జున సమంతకు పెట్టిన అతిపెద్ద కండిషన్. నాగార్జున పెట్టిన ఈ కండిషన్‌కు సమంత మారుమాట మాట్లాడకుండా ఒప్పుకుంది. టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న టైమ్‌లో సినిమాలు వదులుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఈ భామ నటించిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
అయితే ఈ సినిమా తర్వాత సమ్మూ ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. ఇలా నాగార్జున మాట కోసం, ప్రియుడు నాగచైతన్య కోసం తన కెరీర్‌నే త్యాగం చేసింది సమంత. అందుకే సమంత కోసం ఇప్పుడు నాగార్జున ఓ చిన్న పని చేశాడు. సినిమాలు విడిచిపెట్టకముందే సమంతకు కన్నడలో హిట్ అయిన యు-టర్న్ అనే సినిమాను చూసింది. నాగచైతన్యతో కలిసి ఈ సినిమా చూసిన సమంత.. కుదిరితే ఈ సినిమా తెలుగు రీమేక్‌లో నటించాలని ఆశపడింది. రీమేక్ రైట్స్ కూడా తనే తీసుకొని, సొంతంగా నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 
 
అయితే నాగార్జున మాత్రం సమంత కోసం యు-టర్న్ సినిమా రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడట. కుదిరితే ఆ సినిమాను అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే నిర్మించాలని అనుకుంటున్నాడట. ఫిమేల్ ఓరియంటెండ్ మూవీగా, సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సమంతకు నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments