మరో రెండు రోజుల్లో మామయ్య కాబోతున్న అక్కినేని నాగార్జున ఈమధ్య మీసాలు తీసేసి కనబడుతున్నారు. ఏదో ఒక్కసారి తీసేసి ఊరుకుంటారా అనుకుంటే రోజూ నున్నగా షేవ్ చేసేసుకుని కనిపిస్తున్నారు. దీనిపై మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగారు. దీనికి నాగ్ స్పందిస్తూ... ప్రత్య
మరో రెండు రోజుల్లో మామయ్య కాబోతున్న అక్కినేని నాగార్జున ఈమధ్య మీసాలు తీసేసి కనబడుతున్నారు. ఏదో ఒక్కసారి తీసేసి ఊరుకుంటారా అనుకుంటే రోజూ నున్నగా షేవ్ చేసేసుకుని కనిపిస్తున్నారు. దీనిపై మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగారు. దీనికి నాగ్ స్పందిస్తూ... ప్రత్యేకించి నేను ఏదో సినిమాలో నటించేందుకు ఇలా మీసాలు తీయలేదు.
కేవలం ఓ ఛేంజ్ కోసమే తీశాను. నేను మీసాలు తీసేస్తే నా లుక్ చాలా బావుందని అమ్మాయిలు అంటున్నారు అంటూ నవ్వేశారు. ఇకపోతే రాజుగారి గది 2 చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనిపై కూడా నాగార్జున చెపుతూ... ఈ చిత్రంలో నా పాత్ర చాలా డిఫరెంటుగా వుంటుంది. సమంత చాలా బాగా నటించింది. ఇకపోతే నానితో కలిసి ఓ చిత్రం చేస్తున్నాను అని చెప్పారు.