Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటు కోలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌: మల్టీస్టారర్ సినిమాల్లో నాని

అక్కినేని నాగార్జున నేచురల్ స్టార్ నానితో మల్టీస్టారర్ సినిమాలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (14:29 IST)
అక్కినేని నాగార్జున నేచురల్ స్టార్ నానితో మల్టీస్టారర్ సినిమాలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. భలేమంచి రోజు, శమంతకమణి సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య, నాగ్, నాని కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఈ స్క్రిప్టును శ్రీరామ్ ఆదిత్య నాగార్జున, నానిలకు వినిపించాడు. ఇందుకు వారిద్దరూ ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి 'రాజుగారి గది 2' చేసిన నాగార్జున, ప్రస్తుతం అఖిల్ రెండవ సినిమాకి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే సక్సెస్ హీరో నానితో వచ్చిన ఛాన్సును మిస్ చేసుకోకూడదని శతవిధాలా ప్రయత్నిస్తున్నారని టాక్ వస్తోంది.
 
మరోవైపు మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కనున్న మ‌ణిర‌త్నం త‌దుప‌రి ప్రాజెక్టులో కూడా నాని నటిస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక, నానిల‌తో పాటు శింబుకు కూడా ఈ సినిమాలో నటిస్తాడని సమాచారం. వీరితో పాటు విజ‌య్ సేతుప‌తి, మాధ‌వ‌న్‌, ఫ‌హాద్ పాజిల్‌ల‌ను కూడా మణిరత్నం కలిసినట్లు సమాచారం. విజ‌య్ సేతుప‌తికి కాల్షీట్లు ఖాళీగా లేక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టుకు అంగీక‌రించే అవ‌కాశం లేన‌ట్టు స‌మాచారం. ఈ సినిమా షూటింగ్ అక్టోబ‌ర్‌లో ప్రారంభమై వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments