Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్యకు రెండో పెళ్లి.. రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతాయా? (Video)

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (18:56 IST)
సమంత, నాగచైతన్య విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అక్కినేని నాగార్జున నాగ చైతన్యకి రెండో పెళ్లి చెయ్యడానికి సిద్ధం అయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అక్కినేని నాగార్జున కొనేళ్ల క్రితం నాగ చైతన్య, అఖిల్‌కి ఒక్కేసారి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. అది జరగలేదు. కానీ ప్రస్తుతం అఖిల్‌కి పెళ్లి చెయ్యడం కోసం గత కొంత కాలం నుండి నాగార్జున సంబంధాలు చూస్తున్నారట. 
 
అఖిల్‌తో పాటుగా నాగ చైతన్యకి కూడా ఒక్కేసారి పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు నాగ చైతన్య కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని రోజుల నుండి నాగ చైతన్య ప్రముఖ టాప్ హీరోయిన్‌తో లవ్వులో వున్నాడనే వార్తలు వస్తున్నాయి. 
 
ఇక నాగ చైతన్య ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు అన్ని దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. 
 
ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.. ఈ సినిమాతో పాటు ఆయన బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి చేసిన లాల్ సింగ్ ఛధా అనే సినిమా కూడా ఆగష్టు 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వీటితో పాటుగా ఒక్క వెబ్ సిరీస్‌లో కూడా నటించబోతున్నాడు నాగ చైతన్య. 
 
ఇక అక్కినేని అఖిల్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాతో కెరీర్‌లో తొలిసారి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రముఖ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
 
ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్టు 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా తో అఖిల్ కెరీర్ మలుపు తిరగబోతుందని సినీ పండితులు అంటున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments