Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు వస్తానంటున్నారు, మనో వెళ్ళనంటున్నారు..?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (22:21 IST)
బుల్లితెరపై జబర్దస్త్ ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందో చెప్పనవసరం లేదు. టీవీల్లోను, సోషల్ మీడియాలోను జబర్దస్త్ స్కిట్లను తెలుగు ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. స్కిట్ లంటే ఇలా ఉండాలని చెబుతుంటారు.
 
అయితే ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ జడ్జిలు. ఒకరు నాగబాబు, మరొకరు రోజా. మొదట్లో వీరి కాంబినేషన్లో జడ్జిమెంట్ తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. కానీ ఆ తరువాత అదిరింది షోతో నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది స్కిట్ చేసే కమెడియన్లు కూడా తన వెంట తీసుకెళ్ళిపోయారు నాగబాబు.
 
ఇది కాస్త ఈటీవీతో పాటు మల్లెమాల యాజమాన్యానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే అదిరింది షో కొన్నిరోజుల పాటు బాగానే ప్రేక్షకులను ఆదరించింది. కానీ ఆ షోను ప్రస్తుతం ఆపేశారు. 
 
అందులోను ఈ మా ఎన్నికల వల్ల కాస్త బిజీగా ఉన్న నాగాబాబు కాస్త ఆ షో గురించి అస్సలు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఖాళీగా ఉన్న నాగబాబు మళ్ళీ జబర్దస్త్‌కు వెళ్ళాలనుకుంటున్నారట.
 
దీంతో ఈటీవీ యాజమాన్యంతో ఆయన మాట్లాడారట. కానీ ఇప్పటికే మనో ఉండటంతో ఆయన్ను సంప్రదించారట షో నిర్వాహకులు. మూడురోజుల పాటు మీకు షెడ్యూల్... మరో మూడు రోజులు నాగబాబుకు షెడ్యూల్ ఇస్తామన్నారట. కానీ మనో ఏ మాత్రం అంగీకరించడం లేదట.
 
దీంతో నాగబాబుకు ఏం చెప్పాలో.. మనోను ఎలా బుజ్జగించాలో తెలియన నిర్వాహకులు ఆలోచనలో పడిపోయారట. మరి చూడాలి మళ్ళీ నాగబాబు జబర్దస్త్‌కు వస్తారా లేదోనన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments