Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత - చైతూ పెళ్లి మళ్లీ వాయిదా... సరే కానీయండన్న నాగ్?

అక్కినేని నాగార్జున చక్కగా ఇద్దరు కొడుకులు పెళ్లి త్వరత్వరగా చేసేసి తాతయ్య అయిపోవాలనుకుంటుంటే వారి పెళ్లిళ్లు మాత్రం వాయిదాలు పడుతున్నాయి. అఖిల్ అక్కినేని పెళ్లి నిశ్చితార్థం వరకూ వచ్చి క్యాన్సిల్ అయ్యింది. నాగచైతన్య - సమంతల పెళ్లి ఈ ఏడాది మధ్యలోనో చ

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (17:20 IST)
అక్కినేని నాగార్జున చక్కగా ఇద్దరు కొడుకులు పెళ్లి త్వరత్వరగా చేసేసి తాతయ్య అయిపోవాలనుకుంటుంటే వారి పెళ్లిళ్లు మాత్రం వాయిదాలు పడుతున్నాయి. అఖిల్ అక్కినేని పెళ్లి నిశ్చితార్థం వరకూ వచ్చి క్యాన్సిల్ అయ్యింది. నాగచైతన్య - సమంతల పెళ్లి ఈ ఏడాది మధ్యలోనో చివర్లోనో అనుకున్నారు. కానీ వీరి పెళ్లి ఈ ఏడాది కుదిరేట్లు లేదంటున్నారు. మళ్లీ వాయిదా పడినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. దీనికి కారణాలున్నాయట.
 
నాగచైతన్య-సమంతల పెళ్లి వాయిదాకు కారకులు వాళ్లిద్దరేనట. ఎలాగంటే... నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో ఫుల్ బిజీగా మారిపోయాడట. ఆ తర్వాత మరో స్క్రిప్టు రెడీగా వున్నదట. అలాగే సమంత కూడా రాజుగారి గది 2, మహానటి చిత్రాలతో పాటు రామ్ చరణ్ సరసన నటించేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రాలు పూర్తయ్యేసరికి ఏడాది పడుతుందంటున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ కూడా సమంతను తన తాజా చిత్రంలో నటింపజేయాలని చూస్తున్నాడట. 
 
ఇలా సమంత డైరీ మొత్తం ఫుల్ బిజీగా వుండటంతో నాగచైతన్య- సమంతల పెళ్లి ఈ ఏడాది జరిగే అవకాశం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని నాగార్జున వద్దకు తీసుకెళితే... సరే కానీయండి.. అన్నట్లు సమాచారం. ఐతే సినిమాలతో ఎంత బిజీగా వున్నా... పెళ్లి ఘడియలు వస్తే ఆగవు కదా...!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

ఇజ్రాయేల్ టూరిస్ట్ మహిళపై సామూహిక అత్యాచారం

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం - మిస్టరీ మరణాలుగా మిగిలిపోవు!!

విశాఖపట్టణంలో ఎన్నారై టెక్కీ అనుమానాస్పద మృతి!!

పీటీ వారెంట్‍‌పై కర్నూలు నుంచి భవానీపురం పీఎస్‌కు పోసాని తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments