Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమమ్ రీమేక్‌పై పెదవి విప్పిన నాగ చైతన్య... చిత్ర కథపై ఏమన్నారంటే...

దర్శకుడు చందూ మొండేటి, హీరో చైతూ కాంబినేషన్‌లో "ప్రేమమ్" అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ చిత్రానికి రీమేక్ అనే మాటేగానీ ఇందులో ప్రతి సన్నివేశాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించ

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2016 (16:22 IST)
దర్శకుడు చందూ మొండేటి, హీరో చైతూ కాంబినేషన్‌లో "ప్రేమమ్" అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ చిత్రానికి రీమేక్ అనే మాటేగానీ ఇందులో ప్రతి సన్నివేశాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించినట్టు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. ప్రపంచంలో ప్రతి ప్రేమకథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరి అద్భుతంగా ఉంటుంది అని ట్రైలర్‌లో చెప్పగా చిత్రంలోని ప్రతి సీన్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుందని యూనిట్ సభ్యులు వెల్లడించారు. అనుపమ, శృతిహాసన్, మడోన్నా సెబాస్టియన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. 
 
అక్టోబర్ 7న దసరా కానుకగా 'ప్రేమమ్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడే కొద్ది ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, దర్శకుడు చందూ మొండేటి గురించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ''చందూ తన సొంత కథతోనే నాతో సినిమా చేయాలనుకున్నాడు. 
 
కానీ ఆ సమయంలోనే ఇద్దరం కలిసి మలయాళం మూవీ 'ప్రేమమ్' చూశామని అన్నాడు. ఈ సినిమాను రీమేక్ చేద్దామని తాను అంటే, చందూ పెద్దగా ఆసక్తిని చూపలేదని చెప్పాడు. ఆ తర్వాత తన నిర్ణయాన్ని అర్థం చేసుకుని అంగీకరించాడని'' అన్నాడు. ఒక అబ్బాయి స్కూల్‌డేస్‌లో.. కాలేజ్ డేస్‌లో.. జీవితంపై అవగాహన ఏర్పడిన తర్వాత ఎలా ఉంటాడు? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని అన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments