Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మకు ఆ ప్రాంతమంటే ఇష్టం, అక్కడే నా కోరిక తీరాలంటున్న జాన్వీకపూర్

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (17:41 IST)
అలనాటి దివంగత నటి శ్రీదేవి గురించి చెప్పనవసరం లేదు. ఆమె సినిమాలు.. ఆ హిట్లు.. అబ్బా ఒకటేమిటి ఆమె సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె మరణం తరువాత ఆమె కుమార్తెలు సినీరంగంలో రాణిస్తున్నారు. ముఖ్యంగా జాన్వీకపూర్ సినిమాల్లో మంచి పేరే తెచ్చేసుకుంటోంది.
 
దఢక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత కార్గిల్ గర్ల్ గుంజన్ సక్నేనా బయోపిక్‌లోనటించి అందరి ప్రశంసలు అందుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. అందరి దగ్గర శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి.
 
అయితే ఈ మధ్య జాన్వీకపూర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నారు. నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. బంధువుల పెళ్ళికి ఆ ప్రాంతానికి చాలాసార్లు వెళ్లాను. అక్కడ సందడి.. అక్కడి వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది.
 
అందుకే నేను ఒక్కటి కోరుకుంటున్నా. నా పెళ్లి అంటూ జరిగితే అది తిరుపతిలోనే జరగాలి. అది కూడా బంధువుల సమక్షంలో ఆర్భాటంగా జరగాలి. తెల్ల పంచీతో నాకు కాబోయే భర్త అలా అలా నడిచి వస్తూ ఉంటే అబ్బో తెగ ఎంజాయ్ చేసేయాలంటూ పెళ్లి గురించి అప్పుడే తెగ కలలు కనేస్తోందట జాన్వీ. ఈ అమ్మడు ఇప్పటికే ఒక వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో ఉందని ప్రచారం బాగానే సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments